
మందిరాలకు పోటెత్తిన భక్తులు
జయపురం:
కార్తీక మాసం ప్రారంభం కావడంతో గురువారం మందిరాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా దేవతలకు ప్రాతఃకాల పూజలు, దీపారాధనలు వీక్షించేందుకు, హారతులు స్వీకరించేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం స్థానిక శ్రీజగన్నాథ్ మందిరంలో భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. భక్తులకు శ్రీజగన్నాథుడు, సుభధ్ర, బలభద్రలు ప్రత్యేక అలంకరణలతో దర్శనమిచ్చారు. అలాగే చైతన్య మందిరం.రఘునాథ్ మందిరం, మా భగవతీ మందిరం, వల్లభ నారాయణ మందిరం, స్థానిక గీతా మందిరంలో కూడా కార్తిక పూజలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి కార్తీక సంకీర్తనలతో భజన బృందాలు వేకువ జామున నగర సంచారం ప్రారంభించాయి. శ్రీజగన్నాథ్ మందిరంలో ప్రముఖ వ్యక్తులు బిజయ జనాదేవ్, ప్రదీప్ రథ్ రామనాథ్ త్రిపాఠీ, పండిత కృష్ణ దాస్, బిరెన్ మోహణ పట్నాయిక్ తదితరులు పూజలు చేశారు.

మందిరాలకు పోటెత్తిన భక్తులు

మందిరాలకు పోటెత్తిన భక్తులు

మందిరాలకు పోటెత్తిన భక్తులు