
గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఉండ్రుకొండ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపి న వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి వృద్ధునికి గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. కొంత సమయం వరకు సంఘటనా స్థలంలోనే వృద్ధుడు పడి ఉన్నాడు. అటుగా వచ్చిన కొంతమంది చూసి కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కలిమెల పోలీస్ అధికారి(ఐసీసీ) ముకుందో మేల్క తన సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరించారు. వృద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదని, ఈ ప్రాంత వాసి కాదని స్థానికులు తెలిపారు. 72 గంట లపాటు మార్చురీలో ఉంచుతామని, ఏవరైనా వస్తే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహన్ని అప్పగి స్తామని ఐసీసీ తెలిపారు. లేకపోతే తహసీల్దార్, పోలీసుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.