
17న నిరుద్యోగుల ఆవేదన సదస్సు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో నిర్వహించనున్న ‘నిరుద్యోగుల ఆవేదన సదస్సు’ను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలోని క్రాంతి భవన్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు చెల్లించాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించి అన్ని ప్రాంతాలవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్, అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు లైబ్రరీ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను అన్ని విభాగాల్లోనూ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వలంటీర్‌లను కొనసాగిస్తూ విద్యార్హత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీకి అవకాశం కల్పించాలని, పేద నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వేణు, ప్రతినిధులు రామోజీ, కిషోర్, భాస్కర్, మన్మధ, ప్రశాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.