
అన్నదాతల నిరసన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రైతుల వద్ద కోనుగోలు చేసిన వరి విత్తనాలకు ఇప్పటివరకూ ప్రభుత్వం ఇన్‌పుట్ బోనస్ డబ్బులు ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 13న రైతులంతా కలిసి ఛలో భువనేశ్వర్ నినాదంతో రాజధానికి వెళ్లి ఎండీ ఒడిషా సీడ్ కార్పొరేషన్‌ను కలిసి తమ విన్నవించామని గజపతి జిల్లా కృషక్ సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ పట్నాయిక్ గురువారం జిల్లా వ్యవసాయ శాఖ విత్తన విక్రయ కేంద్రం వద్ద తెలియజేశారు. సుమారు జిల్లా 40మంది రైతులకు ఇన్‌పుడ్ బోనస్ అందలేదని తెలియజేశారు.