
సైబర్ ఉచ్చులో మహిళ
● బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.92 లక్షలు మాయం
రాయగడ: సైబర్ ఉచ్చులో ఒక మహిళ చిక్కుకొని తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న రూ.1.92 లక్షలను పోగొట్టుకున్న ఘటన జిల్లాలోని టికిరి పోలీస్‌స్టేషన్ పరిధి ఉపొరొకొటింగ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఆమె తన భర్తతో కలిసి ఎస్పీ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రాజు సాహు అనే వ్యక్తి భార్య సునేమా సాహు సెల్‌ఫోన్‌కు ఈనెల 2వ తేదీన ఆర్టీవో.ఏపీకే ఫైల్ మెసేజ్ ద్వారా వచ్చింది. దీంతో ఆమె ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసింది. వెంటనే కొంత సమయం తర్వాత ఎటువంటి ఓటీపీ లేకుండా యాప్ ద్వారా అకౌంట్ నుంచి ఏడు పర్యాయాలు రూ.1.92 లక్షలను సైబర్ నేరగాళ్లు విత్ డ్రా చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి తన సొమ్ము కనిపించకపోవడంతో సంబధిత బ్యాంకు శాఖ అధికారులతో సంప్రదించింది. దీనిపై తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేయడంతో పాటు కొరాపుట్‌లోని సైబర్ సెల్‌ను ఆశ్రయించాల్సిందిగా సూచించారు. కొరాపుట్‌లోని సైబర్ సెల్‌ను ఆశ్రయించి తమ గోడును వినిపించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రోజులు గడుస్తున్నా ఎటువంటి ఫలితం లేకపోవడంతో బాధితులు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
సచ్చిదానందకు బిషప్‌గా పదోన్నతి
జయపురం: ఎలోహిమ్ క్రిస్టియన్ చర్చ్ జయపురం వారు గురువారం సచ్చిదానందకు పదోన్నతి కల్పిస్తూ బిషప్‌గా నియమించి పవిత్ర అభిషేకం నిర్వహించారు. ఎలోహిమ్ బెలియవర్స్ చర్చిలో ఆయన అందించిన సేవలపై గురుత్‌పూర్ణ సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ సందర్భంగా సచ్చిదానందను సత్కరించారు. సమావేశంలో బిషప్ డాక్టర్ రాజకిశోర్ దిగాల్, బిషప్ డాక్టర్ దిలీప్ కుమార్ బల్, బిషప్ ప్రతాప్ ప్రధాన్, బిషప్ అమసాన్ మల్లిక్, బిషన్ ప్రభాష్ చంధ్ర గోండ్, బిషప్ రాజేష్ పాత్ర, బిషప్ జయ మహంతి, బిషప్ కృష్ణదాన్ నాగ్, బిషప్ సందీప్ బిశ్వాసీ తదితరులు పాల్గొన్నారు.

సైబర్ ఉచ్చులో మహిళ