
పూరీ జగన్నాథ ఆలయంపై డ్రోన్ చక్కర్లు
మహానదిలో చిక్కుకున్న ఏనుగుల గుంపు
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న పూరీ శ్రీ మందిరం శిఖరంపై డ్రోన్ చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. వరుసగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం శ్రీమందిరం శిఖరంపై నిత్యం రెపరెపలాడే పతిత పావన పతాకంపై ఒక డ్రోన్ ఎగురుతున్న దశ్యం సందర్శకుల దృష్టికి వచ్చింది. శ్రీ మందిరం శిఖరం ఈ స్థలాన్ని ‘నో ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించినప్పటికీ తరచూ అక్కడ డ్రోన్ చక్కర్లు కొట్టడం అనేది పెద్ద ప్రశ్న. ప్రసిద్ధ ఆలయంపై తరచుగా డ్రోన్లు ఎగురవేయడం వల్ల ఆలయ భద్రతపై తీవ్ర ఆందోళనలు తలెత్తుతున్నాయి.