
పక్షుల విడిదిలో.. సమస్యల కొలువు
తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రంలో చెట్లపై ఉన్న పక్షులు (ఫైల్)
టెక్కలి రూరల్ :
ప్రముఖ పర్యాటక స్థలం, విదేశీ పక్షుల విడిది తేలినీలాపురంలో సమస్యలు తిష్ఠవేశాయి. ఏటా శీతాకాలం ఆరంభంలో సైబీరియా దేశం నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ అనే వలస పక్షులు టెక్కలి మండలం తేలినీలాపురంలోని విదేశీ పక్షుల కేంద్రానికి చేరుకుని సంతానోత్పత్తి చేసుకుని తిరిగి తమ పిల్లలతో కలిసి వెల్లిపోతాయి. ఈ ఈ పర్యాటక కేంద్రం వద్ద చింతచెట్లపై చేసే విన్యాసాలు, కేరింతలు చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కేంద్రంలో ఇటు పక్షులకు అటు పర్యాటకులకు అనేక సమస్యలు వేధిస్తున్నాయి.
ప్రధాన ఇబ్బందులివే..
ఏటా ఇక్కడి పక్షులను చూసేందుకు వచ్చే వారికి అనేక సమస్యలు స్వాగతిస్తున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. అరకొరగా ఉన్న మరుగుదొడ్లకు తలుపులు విరిగిపోవడంతో నిరుపయోగంగా మారాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన క్రీడా సామగ్ర సైతం పాడైపోయాయి.
పక్షులను చూసేందుకు ఏర్పాటు చేసిన వాచ్ టవర్ నిర్మాణం జరిగి దశాబ్దాలు పూర్తికావడంతో శిథిలావస్థకు చేరుకోవడంతో పర్యాటకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కింద పడిన పక్షులకు సైతం సరైన సంరక్షణ ఉండటం లేదని స్థానికులు చెబుతున్నారు.ఇటీవల రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రాన్ని సందర్శించి కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృధ్ది చేస్తామని ఇచ్చిన హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయారని, ఇప్పటికై న సంబంధిత అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
తేలినీలాపురంలో
కనీస సౌకర్యాలు కరువు
శిథిలావస్థకు వాచ్‌టవర్
మౌలిక వసతులు లేక పర్యాటకుల అవస్థలు

పక్షుల విడిదిలో.. సమస్యల కొలువు

పక్షుల విడిదిలో.. సమస్యల కొలువు