
ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
పర్లాకిమిడి:
పర్లాకిమిడి జిల్లా అటవీశాఖ డివిజనల్ కార్యాలయం ఆవరణలో గురువారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అటవీ శాఖ అధికారి కె.నాగరాజు విచ్చేసి అటవీ అమరవీరుల స్థూపానికి జ్యోతిని వెలిగించి, పూలమాలలు వేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ సిబ్బందికి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఏసీఎఫ్ అరుణ్ కుమార్ సాహు, ఏసీఎఫ్ షైనీశ్రీ దాస్, దేవగిరి, మహేంద్రగిరి, చంద్రగిరి అటవీ సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం వహించారు. తదనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ నాగరాజు మాట్లాడుతూ, కర్తవ్య నిర్వహణలో అటవీ సంపద, వన్యమృగాలను కాపాడతానని సిబ్బందితో ప్రమాణం చేయించారు.

ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం