భారత్‌ మాల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

భారత్‌ మాల ప్రారంభం

Sep 12 2025 6:49 AM | Updated on Sep 12 2025 6:49 AM

భారత్

భారత్‌ మాల ప్రారంభం

న్యూస్‌రీల్‌

గవర్నర్‌ కంభంపాటి హరిబాబు

శుక్రవారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025
రానున్న మార్చికి..

కొరాపుట్‌:

రానున్న 2026 మార్చి ఆఖరు లోపల భారత మాల రోడ్డుని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు ప్రకటించారు. గురువారం సాయంత్రం కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని సద్భావన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆరు అంచెల ఎకనామిక్‌ కారిడార్‌ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని తెలిపారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన కవల టన్నెల్స్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ టన్నెల్స్‌ను తాను సందర్శించానని చెప్పారు. వీటి వల్ల పర్యాటకం అభివృద్ధి చెందుతున్నారు. ఈ టన్నెల్స్‌ ఒక ఇంజినీరింగ్‌ అద్భుతమని, తాను కూడా ఇంజినీరింగ్‌ చదివానని గుర్తు చేశారు. ఈ భారత్‌ మాల వల్ల ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కొరాపుట్‌ జిల్లాలో దేవమాలి పర్వతం ఒక అద్భుతమని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులు వస్తున్నందున అక్కడ ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొరాపుట్‌, మల్కన్‌గిరి జిల్లాల్లో తాను చేసిన పర్యటన మరపురానిదని పేర్కొన్నారు. కొరాపుట్‌ జిల్లాలో రాజపుట్‌ వద్ద గిరిజన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి లక్షపతి పథకానికి గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద కొరాపుట్‌ జిల్లాలో లక్షలాది ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిని అభివృద్ధిలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. కొరాపుట్‌ జిల్లాలో వైద్య సదుపాయాలు చాలా ఉన్నాయన్నారు. అవసరమైతే ప్రైవేట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల మద్దతు కూడా ఉంటుందన్నారు. అంతకుమించిన వైద్యసదుపాయాలు ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో నాల్కో, హాల్‌ వంటి పరిశ్రమలు ఉన్నాయని, మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఆదివాసీల హక్కుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. కొఠియాకు కూడా పరిష్కారం వస్తుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వ అటవీ భూముల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జల జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనన్న పీఎం మోదీ స్వప్నం సాకారమవుతుందన్నారు. మల్కన్‌గిరి జిల్లాలో సీతా కుండ్‌ పర్యటక ప్రాంతం అభివృద్ధికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి బ్యాంకుల పనితీరుపై సమీక్ష చేశానని గవర్నర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ముద్ర లోన్‌ విజయ వంతం చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇరు జిల్లాలోనూ ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. అంతకు ముందు మల్కన్‌గిరి, కొరాపుట్‌ జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సీఎల్పీ నాయకుడు రామ చంద్ర ఖడం కొరాపుట్‌ జిల్లా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్‌ సత్యవాన్‌ మహాజన్‌ కొరాపుట్‌ సంప్రదాయ కళాఖండాలతో గవర్నర్‌ని సత్కరించారు. బ్రిటిష్‌ కాలం నుంచి వస్తున్న గవర్నర్‌ పర్యటన సంప్రదాయాలు పక్కన పెట్టి ఆయన ప్రతి ప్రజా విజ్ఞప్తిని స్వీకరించారు. మీడియా సమావేశం ప్రారంభ సమయంలో చినుకులు పడడంతో పాత్రికేయుల ఇబ్బంది పడడం చూసి వెంటనే సమావేశం నిలిపి వేయించారు. తనతో వారిని కాన్ఫరెన్స్‌ హాల్‌ లోనికి తీసుకొని వెళ్లి సమావేఽశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పవిత్ర శాంత, రుపుధర్‌ బోత్ర, రాంచంద్ర ఖడం, రఘురాం మచ్చో, డీఐజీ కన్వర్‌ విశాల్‌ సింగ్‌, ఎస్పీ రోహిత్‌ వర్మ, జయపూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఆకవరం సస్యా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు హరిశ్చంద్ర, భీమ భూమియ

భారత్‌ మాల ప్రారంభం 1
1/8

భారత్‌ మాల ప్రారంభం

భారత్‌ మాల ప్రారంభం 2
2/8

భారత్‌ మాల ప్రారంభం

భారత్‌ మాల ప్రారంభం 3
3/8

భారత్‌ మాల ప్రారంభం

భారత్‌ మాల ప్రారంభం 4
4/8

భారత్‌ మాల ప్రారంభం

భారత్‌ మాల ప్రారంభం 5
5/8

భారత్‌ మాల ప్రారంభం

భారత్‌ మాల ప్రారంభం 6
6/8

భారత్‌ మాల ప్రారంభం

భారత్‌ మాల ప్రారంభం 7
7/8

భారత్‌ మాల ప్రారంభం

భారత్‌ మాల ప్రారంభం 8
8/8

భారత్‌ మాల ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement