
చంద్రగిరిలో బీజేడీ సమావేశం
పర్లాకిమిడి: జిల్లాలో మోహన బ్లాక్ చంద్రగిరి టిబెటియన్ ఎంటీసీఎస్ బంగళాలో గురువారం బిజూ జనతా దళ్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేడీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ అధ్యక్షత వహించగా, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అతిథిగా విచ్చేశారు. మోహన బ్లాక్‌లో విద్య, ఆరోగ్యం, ఎన్‌ఆర్‌జీఎస్, ఉపాధి పనుల అమలుపై ముఖ్యంగా చర్చించారు. గత ప్రభుత్వంలో ఉపాధి పనులు ఏడాదికి 300 రోజులు కల్పించగా, ప్రభుత్వం మారిన తర్వాత వంద రోజులుకు కుదించినట్టు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బిజేడీ పార్టీ అధ్యక్షులు ప్రదీప్ నాయక్ అన్నారు. సమావేశానికి బిజేడీ మాజీ అధ్యక్షులు జగబంధు దాస్, ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

చంద్రగిరిలో బీజేడీ సమావేశం