
పాముకాటుతో ఇద్దరు మృతి
నరసన్నపేట: నడగాం పంచాయతీ శివరాంపురం గ్రామానికి చెందిన తోలాపి రమణమ్మ (50) పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 5న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 11 గంటల సమయంలో రమణమ్మకు పాము కరిచింది. కొద్ది సమయం గమనించిన రమణమ్మ కుటుంబ సభ్యులకు చెప్పడంతో నరసన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. భర్త సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రమణమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లుకలాపు రవి, నడగాం సర్పంచ్ జల్ల శిల్పా మాధురి సంతాపం వ్యక్తం చేశారు.
బసవరాజుపేటలో..
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం బసవరాజుపేటకు చెందిన వాన అప్పలనాయుడు (38) గురువారం పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గ్రామ సమీపంలోని పొలంలో ఎరువులు వేస్తుండగా పాముకాటు వేసింది. వెంటనే హిరమండలం పీహెచ్‌సీకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పలనాయుడుకు భార్య కుమారి, కుమార్తెలు చేతన, చైతన్య ఉన్నారు.

పాముకాటుతో ఇద్దరు మృతి