
గజపతి జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి
పర్లాకిమిడి: గజపతి జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. ఇందులో భాగంగా గజపతి జిల్లాలో అయిదు రోజులుగా పర్యటిస్తున్న సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి పర్లాకిమిడిలోని సాయి ఇంటర్ నేషనల్ హోటల్‌లో మేధావులతో బుధవారం సాయంత్రం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో ఏడు మండలాల్లో పర్యటించిన తర్వాత జిల్లా అభివృద్ధికి మేధావులు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు సలహాలు ఇవ్వాల్సిందిగా రఘువీరా రెడ్డి కోరారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధి, వ్యవసాయం, వాటి ఉత్పత్తులకు మార్కెటింగ్, పండ్ల సాగుకు అనుకూలమైన గజపతిలో వాటిని ఎగుమతి, శీతల గిడ్డంగులు, ఆదివాసీ విశ్వవిద్యాలయం ఏర్పాటు, రైల్వే లైన్ పొడిగింపు, హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నడపడం ద్వారా ఉపాధి కల్పన కల్పించాలని పలువురు సూచించారు. ప్రతి సమితి కేంద్రంలో పలువురి కలుసుకుని వాటి తుది నివేదిక ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు సమర్పించనున్నానని సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి అన్నారు. మేధావుల సమావేశంలో మోహానా ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు దాశరథి గోమాంగో, అప్సాన శ్రీనివాసరావు, పీసీసీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే చిన్మయి బెహారా, మహిళా కాంగ్రెస్ నాయకురాలు నిరుపమ పాత్రో, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ ఛత్రపతి పాల్గొన్నారు.