
ప్రసవ వేదన
రాయగడ : గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపొవడంతో అంబులెన్స్ చేరుకోలేకపోయింది. దీంతో నిండు గర్భిణి ఆస్పత్రిని నడిపించుకుని తీసుకువెళుతుండగా మార్గమధ్యలోనే పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటన కళ్యాణసింగుపూర్ సమితి చంచడా గ్రామంలో బుధవారం నాడు చోటు చేసుకుంది. చంచడా గ్రామానికి చెందిన సునీల్ ప్రస్కా భార్య వనితా ప్రస్తా నిండు గర్భిణి. బుధవారం పురిటి నొప్పులు రావడంతో ఆశా కార్యకర్త అంబులెన్స్‌కు సమాచారం అందించింది. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో కొద్ది దూరంలో అంబులెన్స్ నిలిచిపోయింది. కుటుంబ సభ్యులు వనితాను నడిపించుకుని తీసుకొస్తుండగా మార్గమధ్యలో శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.