
బోండా గిరిజనుల అభివృద్ధికి కృషి
● రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి బోండా ఘాటీలో బుధవారం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు తొలిసారి పర్యటించారు. ఆదిమ బోండా గిరిజనుల పురోభివృద్ధిపై ప్రసంగించారు. ముందుగా కోరాపూట్ నుంచి మల్కన్‌గిరి జిల్లా గోవిందపల్లి వరకు వచ్చి అక్కడి నుంచి బోండాఘాటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. బోండాఘాటీ పవిత్ర సీతకుండ శ్రీరామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం బోండా డెవలప్‌మెంట్ ఏజెన్సీని సందర్శించారు. బోండా నైపుణ్యభివృద్ధి కేంద్రం, టైలరింగ్ యూనిట్, మల్టీప్రాసెసింగ్ యూనిట్, బోండా సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాల తయారీ పరిశీలించారు. స్వయం సహాయక గ్రూపుల మహిళలు, ఆదిమ బోండా గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 15 మంది గిరిజనులకు భూపట్టాలు అందజేశారు. పలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, ఎస్పీ వినోద్ పటేల్, డీఎఫ్‌ఓ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

బోండా గిరిజనుల అభివృద్ధికి కృషి

బోండా గిరిజనుల అభివృద్ధికి కృషి