
ప్రొఫెసర్ ప్రభాత్ కుమార్ రౌల్ పదవీ కాలం పొడిగింపు
భువనేశ్వర్ : ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఓయూఏటీ) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రభాత్ కుమార్ రౌల్ ఉద్యోగ పదవీ కాలం మూడేళ్లు పొడిగించారు. ఈ పొడిగింపు తక్షణమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నెల 9 నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు మూడేళ్ల వరకు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం లభించింది. ప్రొఫెసర్ ప్రభాత్ కుమార్ రౌల్ ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. ఆయన ఇంతకు ముందు ఒడిశా వ్యవసాయ అభివృద్ధి, పెట్టుబడుల సంస్థ (ఏపీఐసీఓఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. విద్యా రంగంలో పటిష్టమైన పాలన దక్షత కలిగి ఉన్నారు. లోగడ ఓయూఏటీలో డీన్ (ఎక్స్‌టెన్షన్), డీన్ (వెటర్నరీ) మరియు డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్, మానిటరింగ్, మూల్యాంకనం వంటి వివిధ కీలక పదవుల్లో బాధ్యతలను దక్షతతో నిర్వహించారు. బోధన, పరిశోధన, అధికారిక పాలన రంగంలో విస్తృత అనుభవంతో, ప్రొఫెసర్ ప్రభాత్ కుమార్ రౌల్ వైస్ చాన్స్‌లర్‌గా చక్కటి పనితీరు ప్రదర్శించారు.