ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు | - | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు

Sep 9 2025 12:48 PM | Updated on Sep 9 2025 12:48 PM

ఆలయాల

ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు

ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు హోరా.. హోరీగా.. ● పర్లాకిమిడిలో జోనల్‌ స్థాయి క్రీడా పోటీలు

రాయగడ: చంద్ర గ్రహణం కారణంగా ఆదివా రం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో మూసివేసిన మందిరాలు సోమవారం యథావిధిగా తెరుచుకున్నాయి. ముందుగా మందిరా ల్లో సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అభిషేకాలు, పూజలు నిర్వహించి న అర్చకులు అనంతరం భక్తులకు స్వామి వార్ల దర్శన భాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరంలో ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు విగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.

పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల గ్రౌండ్‌లో సోమవారం జోనల్‌ స్థాయిలో వివిధ ఉన్నత విద్యాలయాల క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీలకు 12 విద్యాలయాలు, కళాశాలల నుంచి అండర్‌ 14, అండర్‌ 17 బాలబాలికలు పోటీపడ్డారు. వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌, వివిధ పోటీలకు సుమారు 180 మంది పోటీ పడ్డారు. ఈ క్రీడాంశాలను జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్‌ మాయాధర్‌ సాహు ఆదేశాల మేరకు నిర్వహించారు. మహారాజా బాలుర ఉన్నత పాఠశాల సీనియర్‌ ఉపాధ్యాయులు డి.శ్రీరామ్మూర్తి క్రీడా పతాకం ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. జిల్లా ఇన్‌చార్జి క్రీడా అధికారి సురేంద్ర నాథ్‌పాత్రో క్రీడాకారులతో శపథం చేయించారు. ఈ పోటీలను ఉపాధ్యాయుడు జగన్నాథ పట్నాయక్‌, క్రీడా శిక్షకులు ధీరేంద్ర కుమార్‌ సామల్‌, ఢీల్లేశ్వర్‌ తృణ, రాజకిశోర్‌ పాత్రో, సుదీప్త బారిక్‌ తదితరులు పర్యవేక్షించారు.

నలుగురు వ్యక్తులకు రిమాండ్‌

ఆమదాలవలస: మండలంలోని చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి పూర్ణ (22) అనే వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించినట్లు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి సింహాచలం, పద్మ దంపతుల కుమార్తె పూర్ణకు పట్టణంలోని ఐజే నాయుడు కాలనీకి చెందిన సాయిపల్లి మధుసూదనరావుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. అయితే పూర్ణను అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడంతో కన్నవారింటికి చేరుకుంది. అనంతరం మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆత్మహత్యకు కారణమైన భర్త మధుసూదనరావు, మామ లక్ష్మణ, అత్త సరస్వతీ, మరిది ఈశ్వరరావులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. నలుగురి ముద్దాయిలను స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఐ ఎస్‌.బాల రాజు పాల్గొన్నారు.

గంజాయితో నలుగురు అరెస్టు

పలాస: ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి నెల్లూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పలాస రైల్వేస్టేషన్‌లో ఆదివారం నలుగురు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. వారి నుంచి 6.115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో సోమవారం తెలియజేశారు. దీంతో నెల్లూరు జిల్లా బుజబుజ గ్రామానికి చెందిన సయ్యద్‌ సుల్తాన్‌, బి.అరుణకుమార్‌, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి గ్రామానికి చెందిన సాయిక్‌ జాఫర్‌, తమిళనాడు రాష్ట్రం అనిస్‌నగర్‌కు చెందిన విచిత్రదేవిలపై కేసు నమోదు చేశామన్నా రు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేసి, పలాస జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. వీరి నుంచి గంజాయితో పాటు ఒక సెల్‌ఫోను, రూ.1,020ల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు 1
1/3

ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు

ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు 2
2/3

ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు

ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు 3
3/3

ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement