
బాణం దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి నాయకగూఢ పంచాయతీ పాకనగూఢ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం గ్రామస్తుల మధ్య వివాదం చోటుచేసుకుంది. లక్ష్మణ్ గూడ్, విశ్వనాథ్ గూడ్ మధ్య మాటమాటా పెరగడంతో బాణాలతో దాడి చేసుకున్నా రు. ఈ సంఘటనలో లక్ష్మణ్ గూడ్ పొట్టలోకి బాణం దూసుకుపోయింది. దీంతో కుటుంబీకులు వెంటనే అతన్ని పాండ్రీపాణి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ వైద్యులు మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి రిఫ ర్ చేశారు వైద్యులు శస్త్రచికిత్స చేసి బాణాన్ని తొలగించారు. అయితే పరిస్థితి మరింత విషంగా ఉండడంతో అంబులెన్స్‌లో కోరాపూట్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. మల్కన్‌గిరి పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఐఐసీ రీగాన్‌కీండో కేసు నమోద్ చేసి బాణంతో దాడి చేసిన విశ్వనాఽథ్ కోసం గాలిస్తున్నారు.