
పీసీసీ సోషల్ మీడియా కమిటీ సభ్యుడిగా అస్లామ్ ఖాన్
రాయగడ: రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా కమిటీ సభ్యులుగా అస్లామ్ ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ కమిటి రాష్ట్ర శాఖ చైర్మన్, గుణుపూర్ ఎంఎల్‌ఏ సత్యజీత్ గొమాంగో కమిటీ సభ్యుల వివరాలను పత్రికలకు సోమవారం విడుదల చేశారు. యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఖాన్‌కు సోషల్ మీడియా కమిటీ సభ్యులుగా నియమించడంపై ఆయన అభిమానులు, మద్దతుదారులు అభినందించారు. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఖాన్ వెల్లడించారు.
నాటుసారా కలిగి ఉన్న
వ్యక్తి అరెస్టు
జయపురం: నాటుసారా కలిగి ఉన్నవ్యక్తిని జయపురం అబ్కారీ సిబ్బంది అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి జయపురం సమితి నీలాగుడ గ్రామానికి చెందిన హరిజన్ అని ఎౖక్సైజ్ అధికారి శశిఽకాంత దత్త సోమవారం వెల్లడించారు. నిందితుడి నుంచి నాటుసారా తో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నామన్నారు. తనతో పాటు సిబ్బంది ఆదివారం రాత్రి పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో సౌరాగుడ మార్గంలో ఓ వ్యక్తి స్కూటీపై వేగంగా రావడంతో అనుమానించి అతన్ని తనిఖీ చేయగా నాటుసారా బయటపడిందన్నారు. హరిజన్‌పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచినట్టు పేర్కొన్నారు.
బలిజాత్రకు ఇసుక సేకరణ
జయపురం: ఆదివాసీ ప్రజలు జరుపుకునే ముఖ్యమైన వ్యవసాయ సంబంధిత పండగ బలిజాత్ర. బలిజాత్ర కోసం బొయిపరిగుడ సమీప చికిటి నాళా (చికిటి నది)లో ఇసుక సేకరించారు. బొయిపరిగుడ సమీప ప్రసిద్ధ బీరఖంభ మందిర పూజారి బలిజాత్ర పూజా కమిటీ సభ్యులు ఇసుక సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చికిటినాళ నుంచి సేకరించిన ఇసుకకు పూజ చేసి తమ గ్రామంలో గల గ్రామ దేవత మందిరంలో బుట్టలో వేసి పూజలు చే స్తామని అనంతరం బుట్లలో ఉన్న ఇసుకను గ్రామస్తులకు పంచుతామని వారు బుట్టలలో గల ఇసుకలో వివిద రకాల విత్తనాలు చల్లి దేవ త గుడిలో ఉంచుతారని అర్చకులు తెలిపారు. ఈ నెల 12న బలిజాత్ర జరుగుతుందని తెలిపారు.
ఘనంగా హనుమాన్
మందిర వార్షికోత్సవం
జయపురం: జయపురం లింగరాజనగర్‌లో ఆ ప్రాంత ప్రజలచే స్థాపించబడిన శ్రీరుద్రవీర హనుమాన్ మందిర నాలుగో వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో బాబూ బాయ్ భజరంగ్ బృందం పాల్గొని 108 హనుమాన్ చాలీశా భక్తులకు వినిపించారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొని హనుమాన్ చాలీశా విని తరించారు. ఈ సందర్భంగా నిరుపేద బ్రాహ్మణ పిల్లలకు ఉచితంగా ఉపనయనం జరిగింది. అలాగనే రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ మందిర కమిటీ అధ్యక్షులు చిత్తరంజన్ పండ, కోఆర్డినేటర్ బిజయరాయ్ జెనాదేవ్, ఆలయ ట్రస్టీ విప్రచరణ నాయిక్, రాం ప్రసాద్ పట్నాయక్, శ్యామఘణ మహాపాత్రో, జితేంద్ర పాణిగ్రహి, ప్రమోద్ కుమార్ జైన్, అజిత్ దాస్ పాల్గొన్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.

పీసీసీ సోషల్ మీడియా కమిటీ సభ్యుడిగా అస్లామ్ ఖాన్

పీసీసీ సోషల్ మీడియా కమిటీ సభ్యుడిగా అస్లామ్ ఖాన్