
55 మంది మాస్టర్ శిక్షకులకు ప్రశంసా పత్రాలు
పర్లాకిమిడి: స్థానిక జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ (డైట్)లో జిల్లా స్థాయి ఆదికర్మయోగి శిక్షణ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి జిల్లా సమగ్ర గిరిజనాభివృధ్ధి శాఖ పీఓ అంశుమన్ మహాపాత్రో అధ్యక్షతన జరగ్గా జిల్లా పరిషత్ అదనపు కార్యనిర్వహణాధికారి పృథ్వీరాజ్ మండల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సల్మాన్ రైకా తదితరులు పాల్గొన్నారు. వారంరోజులుగా జరిగిన ఆదికర్మయోగి శిక్షణ శిబిరంలో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశువికాస్, పంచాయితీరాజ్, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యులకు బ్లాక్ స్థాయి మాస్టర్ ట్రైనర్‌లతో శిక్షణ ఇప్పించారు. 2036 కల్లా వికసిత్ ఒడిషా, 2047 కల్లా వికసిత భారత్ అనే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీఓ సంస్థలు కలసి పనిచేయాలన్న లక్ష్యంతో ముందుకుపోవాలని ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో అన్నారు. మొత్తం జిల్లావ్యాప్తంగా ఏడు సమితి కేంద్రాల నుంచి 55 మంది సమితి మాస్టర్ ట్రైనర్లుగా నియమించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా అనేకమంది మాస్టర్ శిక్షకులకు సర్టిఫికెట్లను నోడల్ అధికారి అంశుమాన్ మహాపాత్రో ప్రదానం చేశారు.

55 మంది మాస్టర్ శిక్షకులకు ప్రశంసా పత్రాలు

55 మంది మాస్టర్ శిక్షకులకు ప్రశంసా పత్రాలు