
అలరించిన జానపద కళా నృత్యాలు
పర్లాకిమిడి: జిల్లా స్థాయి నువాఖయి భేట్‌ఘాట్–2025 ఉత్సవాలు స్థానిక టౌనుహాల్‌లో సమలాయి నృత్య పరిషద్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా ఏడీఎం ఫాల్గుణీ మఝి విచ్చేసి మాట్లాడారు. ఒడిశాలో సాహిత్యం, జానపద, ఒడిస్సీ నృత్యాలు ప్రపంచ ప్రఖ్యాత గాంచినవని అన్నారు. గౌరవ అతిథిగా పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, రఘునాథ పాత్రో, సమాలాయి నృత్యపరిషత్ కార్యదర్శి నృసింహాచరణ్ పట్నాయక్, ఆదర్శదాస్ తదితరులు పాల్గొన్నారు. నువాఖయి ఉత్తర ఒడిశా అతి ముఖ్యమైన పెద్ద పండుగ. ఈ సందర్భంగా సమాలాయి నృత్య పరిషత్ ఇతర స్థానిక కళాకారులచే సంబల్‌పురి, బర్‌ఘడ్, ఒడస్సీ జానపద నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉత్తమ నృత్య కళాకారులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలతో ఏడీఎం. మఝి సత్కరించారు.

అలరించిన జానపద కళా నృత్యాలు

అలరించిన జానపద కళా నృత్యాలు

అలరించిన జానపద కళా నృత్యాలు