తెలుగు ఉపాధ్యాయుల నిరసన
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయుల బదిలీల్లో తెలుగు ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని డీటీఎఫ్, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లాశాఖ నాయకులు ఆరోపించారు. తప్పనిసరి బదిలీలు, రీ–అప్పోర్సన్‌కు గురైన తెలుగు ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ ర్యాంకు తర్వాత పెట్టిన పాఠశాలలకు బదిలీ అయినట్లు ఆర్డర్లు రావడంతో శుక్రవారం డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. వాస్తవానికి సీనియారిటీ నెంబర్‌కు ముందు ఉన్న పాఠశాలలకు మాత్రమే బదిలీ కావాల్సి ఉందన్నారు. ఈ మేరకు డీఈఓ తిరుమల చైతన్యకు వినతిపత్రం అందజేశారు.


