గంజాయితో ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: జిల్లా అబ్కారీ సూపరింటెండెంట్ ప్రదీప్‌కుమార్ సాహు ఆదేశాల మేరకు మొబైల్ యూనిట్ గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీనిలో భాగంగా పర్లాకిమిడి కొత్త బస్టాండ్, భవానీ టాకీస్ వద్ద బైక్‌పై గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 52 కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసన్నకుమార్ పటేల్, యసై మఝి శోబోరో, మోడల్ ఇన్‌స్పెక్టర్ మోనూ ఆయాల్ తదితరులు పాల్గొన్నారు.
నాటుసారా తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
జయపురం: నాటుసారాను అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం అబ్కారీ అధికారి సుబ్రత కేశరీ హరిస్ బుధవారం తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం సమితి గొడొపొదర్ పంచాయతీ దుబులి గ్రామానికి చెందిన త్రినాథ్ పొరజ, జయపురం సబ్‌డివిజన్ నువాగుడ వాసి ఆకాశ హరిజన్, నువాపుట్ గ్రామ వాసి ఈశ్వర బిశాయి ఉన్నారన్నారు. వీరిని కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించినట్టు సుబ్రత్ కేశరీ హరిష్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఎకై ్సజ్ అధికారి హరిష్, ఏఎస్సై బలరాం దాస్‌లు తమ సిబ్బందితో పెట్రోలింగ్ జరుపుతుండగా నాటుసారా తీసుకెళ్తున్న ముగ్గురు పట్టుబడినట్టు పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.


