
న్యాయ సేవలపై అవగాహన
జయపురం: జాతీయ న్యాయ సేవా, రాష్ట్ర న్యా య సేవా ప్రదీకరణల ఆదేశం మేరకు కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షుల సూచన మేరకు శుక్రవారం సాథీ (స్నేహ) సంఘటన ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీ ద్వారా ప్రదీకరణ సభాగృహంలో న్యాయ పరిచయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. 18 ఏళ్ల వయసు లోపు వారికి సాక్షరత, సురక్ష, లేక ఉన్నవారు, రోడ్లపై, పట్టణాలలో, రైల్వే స్టేషన్లలో అనాథాలుగా ఉంటున్న శిశువుల రక్షణ, త్యజింపబడిన పిల్లలు, లేదా తల్లిదండ్రులు వదలివేసిన పిల్లలు, భిక్ష మెత్తుకుంటున్న బాల కార్మికుల హక్కులపై అవగాహన కల్పించారు. న్యాయవాది దివాకరరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి, శాశ్వత లోక్ అదాలత్ విచారపతి, జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యుమయ సుజాత, జిల్లాలోని ఏడుగురు తహసీల్దార్లు, జిల్లా వైద్యాధికారి, జిల్లా సమాజ సంక్షేమ అధికారి, జిల్లా శిశు సురక్షా అధికారి, అదనపు జిల్లా విద్యాధికారి, కిశోర్ విభాగ పోలీసు అధికారి, ఐదుగురు శిశు పరిశీలనఅధికారులు, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ ప్యానెల్ న్యాయవాది, పారాలీగల్ స్వచ్ఛంద సేవకులు పాల్గొనివారి అభిప్రాయాలను వెల్లడించారు.