
పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు
కొరాపుట్/ జయపురం: పబ్లిక్ ఆస్తులు, స్థలాల్లో ప్రైవేటు కాలేజీల పోస్టర్లు, ఫ్లెక్సీలు అతికిస్తే చర్యలు తప్పవని జయపురం సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్య నిర్వాహక అధికారి అక్కవరం సస్యా రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ సిబ్బందితో వెళ్లి పోస్టర్లు తొలగింపజేశారు. అనుమతులు లేకుండా బేనర్లు, వాణిజ్య ప్రకటనలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీలు, విద్యుత్ స్తంభాలు, బస్సు స్టాప్‌లకు పోస్టర్లు అతికిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలు బోధించాల్సిన కొన్ని కళాశాలలు వాటిని విస్మరిస్తూ తమ ప్రకటనలను ఇష్టారాజ్యంగా అంటించడం తగదని పేర్కొన్నారు.

పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు