
టీడీపీ నాయకులకు భలే ‘ఉపాధి’
సంతబొమ్మాళి: ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుని జేబులు నింపుకుంటున్నారు. కాపుగోదాయవలస గ్రామంలో జరుగుతున్న తంతు గమనిస్తే అధికార పక్ష నేతల తెలివి అర్థమవుతుంది. గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో పనికి రాకుండానే స్థానిక టీడీపీ నాయకుల పేర్లు మస్టర్లలో నమోదు చేసి డబ్బులను దోచుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ అంగ ధనుంజయ దొంగ మస్టర్లు వేస్తూ చేతివాటం చూపిస్తున్నాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కుత్తమ శివప్రసాద్ (జాబ్ కార్డు నంబర్ 010220) ఉపాధి పనికి వెళ్లకుండానే 36 రోజుల పాటు ఆయ న పేరిట మస్టర్‌ను నమోదు చేసి తొమ్మిదివేల రూ పాయలు అకౌంట్‌లో వేసుకున్నారు. సైనా భీష్మారావు, అతని భార్య ఈశ్వరమ్మ (జాబ్ కార్డు నెంబర్ 010153) పేరున కలిపి సుమారు 72 రోజులు మస్టర్లు నమోదు చేసి సుమారు రూ.18వేలు లాగేశారు. దున్న చంద్రయ్య, అతని భార్య నరసమ్మ (010122) పేరున 42 రోజులు మస్టర్లు నమోదు చేసి సుమారు రూ. 14వేలు వారి ఖాతాలో జమ చేసుకున్నారు. వాడరేవు తారకేశ్వరరావు (జాబ్ కార్డు నంబర్ 10313), కారాడ ప్రభ (జాబ్‌కార్డు నంబర్ 010262) పేరున మస్టర్లు నమోదు చేసి వారి అకౌంట్లోనూ డబ్బులు వేసుకున్నారు. టీడీపీ నాయకుడు కుత్తమ శివప్రసాద్ అక్క సైనా ఉమా దేవికి (జాబ్ కార్డు నంబర్ 010174) సుమారు 70 ఏళ్లు ఉంటాయి. ఆమె కిడ్నీ పేషెంట్. అయినా ఆమె పేరున కూడా 36 రోజులు మస్టర్లు నమోదు చేసి తొమ్మిది వేలు పైచిలుకు డ్రా చేశారు. ఇలా టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల పేర్లతోనే కా కుండా వలస వెళ్లిన వారు, విదేశాల్లో ఉన్న వారి పేర్లతో కూడా మస్టర్లు నమోదు చేస్తున్నారని ఉపా ధి వేతన దారులు ఆరోపిస్తున్నారు. చింతల ట్యాంక్, చింతలచెరువు, జగన్నాథసాగరం, యర్రా ట్యాంక్ చెరువుల్లో పనిచేసినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ అంగ ధనుంజయ నమోదు చేశారు. నిరుపేదలకు వెళ్లాల్సిన డబ్బులు ఇలా టీడీపీ నాయ కులు వారి బంధువుల ఖాతాల్లోకి వెళ్లడంపై వేతన దారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.