
డ్రైనేజీల్లో పూడికతీత పనులు ప్రారంభం
జయపురం: వర్షాకాలం దగ్గర పడుతుండటంతో పట్టణ పారిశుథ్యంపై జయపురం మున్సిపాలిటీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. వర్షం పడితే పట్టణంలోని చిన్న కాలువలతోపాటు పెద్దకాలువలు పారక నీరు రోడ్లపైకి వచ్చేస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇప్పటికే పలు డ్రైన్‌లు చెత్తలతో పేరుకు పొయి కనిపిస్తున్నాయి. వాటిని పరిశుభ్రపరచక పోతే దోమలకు ఆలవాలమై మలేరియా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ప్రజలను రక్షించేందుకు మున్సిపల్ అధికారులు ముందుగానే చర్యలు చేపట్టారు. జేసీబీల ద్వారా కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. కాలువల్లో చెత్త వేయకుండా సహకరించాలని జయపురం సబ్‌కలెక్టర్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్య రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

డ్రైనేజీల్లో పూడికతీత పనులు ప్రారంభం