పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి సమితి రామగిరి ప్రాంతంలో తులసీనగర్‌లో ఐదుగురు చిన్నారులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు రామగిరి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రామగిరిలో చికిత్స పొందుతూ ఒక చిన్నారి తులసీ బోడమొండి (5) మృతిచెందగా, పర్లాకిమిడి ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో చిన్నారి గుణాబతి బోడమొండి (3) మృతి చెందినట్టు ఆర్.ఉదయగిరి పోలీసులు తెలియజేశారు. మిగతా ముగ్గురు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు ఇచ్చే ఛతువా పిండిలో మరేదో ఆహారం కలిపి తినడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వ డాక్టర్లు అనుమానిస్తున్నారు.
విషాహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి