పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 10,363 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 10,314 మంది హాజరయ్యరని, 49 మంది గైర్హాజరయ్యరని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుంగా పరీక్ష సజావుగా నిర్వహించామన్నారు. 61 పరీక్షా కేంద్రాల్లో వర్యవేక్షక బృందం 6 కేంద్రాల్లో తాను సందర్శించినట్లు తెలిపారు.
డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు