మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల రూ.1,20,62,105 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు బుధవారం వెల్లడించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరావు సమక్షంలో కానుకలను లెక్కించారు. డీసీ మాట్లాడుతూ నగదుతో పాటు భక్తులు కానుకల రూపంలో వెండి ఒక కిలో 900 గ్రాములు, బంగారం 69 గ్రాములు, విదేశీ కరెన్సీ అమెరికన్ డాలర్లు 230, ఆస్ట్రేలియన్ డాలర్లు 70, కెనడా డాలర్స్ 20, ఇంగ్లాండ్ పౌండ్స్ 10 వచ్చాయన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ సీఈవో డాక్టర్ జె. అరుణ బదిలీ అయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అరుణను తదుపరి పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ స్థానంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణా సంస్థ (ఏపీఎస్ఐఆర్డీపీఆర్) డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న మోమిడి శ్రీహరిని కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా నియమించారు.


