స్థానికం ముంగిట కుట్రల పర్వం | - | Sakshi
Sakshi News home page

స్థానికం ముంగిట కుట్రల పర్వం

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

స్థానికం ముంగిట కుట్రల పర్వం

పౌర సేవల నిలిపివేత కుట్రలకు తెరలేపిన చంద్రబాబు సర్కారు

గ్రామ/వార్డు సచివాలయాల నుంచి 4 రకాల పౌర సేవలు తొలగింపు

కులం, ఆదాయం, నీటి తీరువా, ఇతర సేవల రీ ఇష్యూస్‌ నిలిపివేత

మన మిత్ర యాప్‌లో ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఇబ్బందులు

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు సర్టిఫికెట్లు రాకుండా చేసేందుకేనని విమర్శలు

సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాల నుంచి నాలుగు రకాల పౌర సేవలను తప్పించడమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు అందకుండా చేసేందుకే ఈ చర్య లని స్పష్టంచేస్తున్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేశారు. ఏకంగా 540 రకాల సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందించారు. ఐదేళ్ల పాటు రైతులు, ప్రజలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సచివాలయాల ద్వారానే పౌరసేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచి మన్ననలు పొందారు. 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రజలకు శరాఘాతంగా మారాయి. నిన్నటి మొన్నటి వరకు సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందు తుండగా, ఇప్పుడు కుట్రపూరితంగా పలు పౌర సేవలను సచివాలయాల నుంచి దూరం చేశారు. తాజాగా కుల, ఆదాయ, ఇతర సేవల రీఇష్యూ, పాస్‌బుక్‌ రీప్రింటింగ్‌ వంటి సేవలను సచివాలయాల నుంచి తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మనమిత్రలో అందని సేవలు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 670 సచివాలయాలు ఉన్నాయి. ఒక్క విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోనే 286 వరకు వార్డు సచివాలయాలు ఉన్నాయి. రెండు వారాల కిందట ప్రభుత్వం సచివాలయాల్లో నాలుగు రకాల సేవలను నిలిపి సింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ సేవలను వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే వాట్సాప్‌ గవర్నెన్స్‌కు పెద్దగా స్పందన లేదు. ప్రజలు సచివాలయాల ద్వారానే సేవలు పొందుతున్నారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ వస్తుందన్న తరుణంలో ఉన్నఫళంగా సచివాలయాల్లో కుల, ఆదాయ, ఇతర సేవల రీఇష్యూ, పాస్‌బుక్‌ రీప్రింటింగ్‌ సేవలను తొలగించి, మనమిత్ర యాప్‌ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. మనమిత్ర యాప్‌లో ఇతర సేవల రీఇష్యూస్‌ ఆప్షన్‌ నొక్కగానే ఓటీపీ వరకు వచ్చి ఆగిపోతోంది. దీంతో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు మనమిత్రలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రాక ఆందోళన చెందుతున్నారు. సచివాలయాలకు వెళ్తే తమ పరిధిలో లేదని చెబుతున్నారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి స్కూల్‌లో ఇవ్వడానికి కుల ధ్రువీకరణ పత్రం కోసం సచివాలయానికి వెళ్లగా ఇక్కడి సిబ్బంది మనమిత్ర యాప్‌లో తీసుకోవాలని సూచించారు. అతను మనమిత్ర యాప్‌లో రెవెన్యూ సేవలను ఎంచుకుని, ఆ తరువాత ఇంటిగ్రేటెడ్‌ ధ్రువీకరణ పత్రం మళ్లీ జారీ అనే ఆప్షన్‌ ఎంపిక చేసి నిర్ధారించాడు. తరువాత గ్రామం/వార్డు సచివాలయం, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసేందుకు యత్నిస్తే రెడ్‌మార్కు చూపిస్తోంది. అసలు విజయవాడ పేరే కనిపించడం లేదని, పదిరోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆ వ్యక్తి వాపోతున్నాడు.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. ఎందుకీ కుట్ర

స్థానిక సంస్థల ముంగిట చంద్రబాబు ప్రభుత్వం సచివాలయాల్లో కుల, ఆదాయ, నీటి తీరువా, భూముల పాస్‌బుక్‌ రీప్రింటింగ్‌, ఇతర సేవల రీఇష్యూ తదితర సేవలను ఎందుకు తొలగించిందో చెప్పలేదు. మనమిత్ర యాప్‌లో ఆ సేవలు పొందొచ్చంటూ ఉచిత సలహాలు ఇచ్చింది. సచివా లయాలలో ఇప్పటికే రేషనలైజేషన్‌ పేరిట ఉద్యోగులను కుదించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పౌరసేవలను తగ్గించే కుట్రలకు తెరలేపిందే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌ సీపీని ఎదుర్కొనే ధైర్యం లేక ఆ పార్టీ అభ్యర్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందకుండా చేయాలనే ప్రభుత్వం ఈ కుట్రలకు పాల్పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల వేళ తమ అభ్యర్థులకు కుల, ఆదాయ, ఇతర సేవల రీఇష్యూస్‌ సేవల ధ్రువపత్రాలు అందడం లేదని, తక్షణమే వాటిని అందించేలా ఆదేశించాలని వైఎస్సార్‌ సీపీ హైకోర్టును కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement