శుక్రవారం శ్రీ 9 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 9 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 9 2026 2:02 AM | Updated on Oct 9 2026 2:02 AM

శుక్రవారం శ్రీ 9 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 –8లోu

న్యూస్‌రీల్‌

ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో కీలక మార్పులు 4 క్యూలైన్లలో ఉచితంగా దుర్గమ్మ దర్శనం రూ.1000 టికెట్‌పై బంగారు వాకిలి దర్శనం ఘాట్‌రోడ్డు, మహామండపం మీదుగా కొండపైకి క్యూలైన్లు ఏర్పాటు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవ రాత్రి మహోత్సవాలకు వేళయింది. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 48 గంటల్లో ప్రారంభమయ్యే ఉత్సవాలకు దేవస్థానం కీలక మార్పులు చేపట్టింది. అన్ని క్యూలైన్లలో అమ్మవారి దర్శనానికి భక్తులను ఉచితంగా అనుమతించనుంది. వీఐపీ దర్శనం ధర మాత్రం రూ.1000గా నిర్ణయించింది. తొలుత వీఐపీ టైం స్లాట్‌ ఏర్పాటు చేసి ఆ సమయంలో వచ్చిన వారికే అంతరాలయ దర్శనం కల్పిస్తామని ప్రకటించింది. తీరా ఉత్సవాలకు ముందు టికెట్‌ కొన్న వారందరికీ బంగారు వాకిలి ద్వారా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ప్రకటించింది. వీఐపీ టికెట్‌ ద్వారా దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

కీలకంగా మారనున్న ఓం టర్నింగ్‌

ఏటా దసరా ఉత్సవాల్లో సిఫార్సులు, ప్రముఖుల పేర్లతో దర్శనాలు భారీగా జరిగేవి. ఈ ఏడాది ఆలయ సిబ్బందికి జారీ చేసే డ్యూటీ కార్డులు ఒక సారి మాత్రమే వినియోగించే వీలుంది. డ్యూటీ పాయింట్‌, ఏ సమయానికి డ్యూటీకి వెళ్లాలనే అంశాలను ఆ కార్డులో పొందుపరుస్తారు. పోలీసు, మీడియా, అర్చకులు, ఇతర సిబ్బందికి కూడా ఇదే తరహాలో డ్యూటీ కార్డులను జారీ చేస్తున్నారు. ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్‌ వద్ద ప్రత్యేక చెక్‌ పాయింట్‌ వద్ద తనిఖీలు నిర్వహించిన తర్వాతే వారిని ఆలయ పరిసరాల్లోకి అనుమతిస్తారు.

టీటీడీ స్థలం నుంచి వాహనాలు

కొండపైకి ప్రయివేటు వాహనాలను అనుమతించడం లేదు. కుమ్మరిపాలెం సెంటర్‌లోని టీటీడీ స్థలం నుంచి కొండపైకి బస్సులు నడుస్తాయి. అక్కడి నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనే ఉభయదాతలు, రూ.1000 టికెటు కొన్న భక్తులను కొండపైన ఓం టర్నింగ్‌ వరకు చేరుస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా వీఐపీ టికెటు కొన్నవారు అమ్మవారిని దర్శించుకుని మల్లేశ్వర స్వామి వారి ఆలయం మీదగా కొండ దిగువకు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి కుమ్మరిపాలెం వెళ్లేవారు దేవస్థానం బస్సులో చేరుకోవాలి. కీలక ప్రాంతాల్లో బూమ్‌ బ్యారియర్లు ఏర్పాటు చేయనున్నారు. కొండపైకి వచ్చే ఇతర వాహనాలను పూర్తిగా నియంత్రించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రద్దీ లేకుండా....

దసరా ఉత్సవాల తొలి మూడు రోజులు భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంటుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. రద్దీ అధికంగా ఉంటే వీఎంసీ కార్యాలయం పక్కనే ఏర్పాటు చేసిన హోల్డింగ్‌ పాయింట్‌కు భక్తులు చేరుకుని అక్కడి నుంచి వినాయకుడి గుడి క్యూలైన్‌లోకి ప్రవేశించేలా ఏర్పాట్లు జరిగాయి. రద్దీ సాధారణంగా ఉంటే నేరుగా వినాయకుడి గుడి క్యూలైన్‌లోకి చేరుకోవచ్చు. రద్దీ తక్కువగా ఉంటే రథం సెంటర్‌, టోల్‌గేట్‌ వద్ద కూడా భక్తులను క్యూలైన్‌లోకి అనుమతిస్తారు.

మూలా నక్షత్రం రోజు నుంచి భక్తులు హోల్డింగ్‌ పాయింట్ల ద్వారానే క్యూలైన్‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది. హోల్డింగ్‌ పాయింట్లో మంచినీరు, బిస్కెట్లు, మజ్జిగతో పాటు అమ్మవారి ప్రసాదాలను భక్తులకు అందిస్తారు.

వర్షం కురిస్తే మహామండపం మీదుగా...

దసరా ఉత్సవాల సమయంలో భారీ వర్షాలు కురిస్తే క్యూలైన్లను మహా మండపం మీదుగా మళ్లించనున్నారు. ఇందుకు కోసం కనకదుర్గనగర్‌, మహామండపం వరకు క్యూలైన్ల నిర్మాణం పూర్తయింది. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి ఆలయ గాలిగోపురం వరకు మొత్తం 1.6 కిలోమీటర్ల మేర క్యూలైన్లు, మూడు హోల్డింగ్‌ పాయింట్లలో సుమారు తొమ్మిది వేల మంది వేచి ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఉత్సవాల విధుల్లో 9 వేల మంది..

దసరా ఉత్సవాల్లో అన్ని ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టుల నుంచి సుమారు తొమ్మిది వేల మంది సేవలు అందించనున్నారు. దుర్గగుడి సిబ్బంది 300 మంది, ఇతర దేవాలయాల సిబ్బంది 200 మంది, రెవెన్యూ శాఖ నుంచి 1500 మంది, పోలీసు సిబ్బంది 3,500 మంది, దేవస్థాన శానిటేషన్‌ సిబ్బంది 1,500 మంది, శానిటేషన్‌ సిబ్బంది 1,800 మంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారు. భక్తుల కోసం 370 తాత్కాలిక టాయిలెట్లు, 54 పాయింట్లలో వాటర్‌ బబూల్స్‌ ఏర్పాటు చేశారు. సీతమ్మ వారి పాదాల నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు కిలోమీటరు మేర స్నానఘాట్‌లో జల్లు స్నానాలకు 600 షవర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడే భక్తులు దుస్తులు మార్చుకునే గదులు సిద్ధం చేశారు.

దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు లడ్డూ ప్రసాదాలను అందించేందుకు దేవస్థానం 18 కౌంటర్లు ఏర్పాటు చేసింది. కనకదుర్గనగర్‌లో నాలుగు కౌంటర్లు ఆన్‌లైన్‌ కౌంటర్లు, మిగిలిన పది కౌంటర్లు డబ్బులు చెల్లించి ప్రసాదాలను కొనుోలు చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. బస్టాండ్‌లో ఒకటి, రైల్వే స్టేషన్‌లో మరో కౌంటర్‌తో పాటు లడ్డూ ఏటీఎం మిషన్‌ ఒకటి, ఓం టర్నింగ్‌ వద్ద వీఐపీ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల్లో 55 లక్షల లడ్డూలను తయారు చేసి భక్తులకు అందించాలని దేవస్థానం నిర్ణయించింది. గత ఏడాది మొత్తం 42 లక్షల లడ్డూలు భక్తులు కొనుగోలు చేశారు. నూతన అన్నదాన భవనంలో బఫే పద్ధతిలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement