గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో రెన్యువల్ కాకుండా మిగిలిన మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో గురువారం లాటరీ ప్రక్రియ నిర్వహించారు. 2026–27 సంవత్సరానికి గాను జిల్లాలోని 124 మద్యం దుకాణాలకు 106 దుకాణాలు రెన్యువల్ అయ్యాయి. మిగిలిన 18 మద్యం దుకాణాలకు కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఒక్కో దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు అందినప్పుడే ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. జిల్లాలో 16 మద్యం దుకాణాలకు నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో లాటరీ నిర్వ హించి దుకాణాలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాస్‌రావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాస్‌రావు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్.వి.రామశివ, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


