సరస్‌ అజీవిక మేళాకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సరస్‌ అజీవిక మేళాకు పటిష్ట ఏర్పాట్లు

Oct 9 2026 2:02 AM | Updated on Oct 9 2026 2:02 AM

సరస్‌ అజీవిక మేళాకు పటిష్ట ఏర్పాట్లు

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈ నెల 13 నుంచి 31 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి సరస్‌ అజీవిక మేళాకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టర్‌తోపాటు సెర్ప్‌ సీఈఓ వాకాటి కరుణ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్‌ఆర్‌ఎల్‌ఎం డైరెక్టర్‌ డాక్టర్‌ మోలిశ్రీ, జాయిట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ తదితరులు గురువారం పున్నమిఘాట్‌ వద్దకు చేరుకుని సరస్‌ మేళా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ లక్ష్మీశ మీడియాతో.. మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి మేళాకు వచ్చేవారి కోసం 600 వరకు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఒకే వేదికపై తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. హస్తకళ, చేనేత ఉత్పత్తుల కళాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొ న్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయ కళలు, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింభించే ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టు కునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగర ప్రజలతోపాటు జిల్లా ప్రలు, సందర్శకులు సరస్‌ మేళాను పెద్ద సంఖ్యలో సందర్శించి వివిధ రాష్ట్రాల మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. భారత రాష్ట్రపతితోపాటు వివిధ రాష్ట్రాల ప్రముఖులు కూడా హాజరవుతారని తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిర్వహించనున్న దసరా మహోత్సవాలతోపాటు విజయవాడ ఉత్సవ్‌, సరస్‌ మేళా వంటి మూడు కార్యక్రమాలు ఒకేసారి జరుగనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement