సీజేపీకి మద్దతుగా ఎంపీ చిన్ని కుమార్తె పోస్టులు | - | Sakshi
Sakshi News home page

సీజేపీకి మద్దతుగా ఎంపీ చిన్ని కుమార్తె పోస్టులు

Jul 28 2026 2:00 AM | Updated on Jul 28 2026 2:00 AM

● కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ ఫ్ల కార్డులు ● చర్చకు దారితీయడంతో పోస్టులు తొలగించిన వైనం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని)కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ)ఇటీవల నిర్వహించిన ఉద్యమంలో పాల్గొనటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమంలో ఎంపీ కుమార్తె స్నిగ్ధ పాల్గొన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘటైన విమర్శలు చేశారు. దీనిపై ఆమె సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు తీవ్ర చర్చకు దారితీయడంతో ఆమె ఆ పోస్టులు తొలగించింది. ఎన్‌డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. కూటమి మద్దతుతోనే 2024 ఎన్నికల్లో చిన్ని ఎంపీగా విజయం సాధించారు. తండ్రి ఎంపీగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమార్తె పోస్టులు పెట్టడం, కాక్రోచ్‌ జనతా పార్టీ ఆందోళనకు మద్దతుగా ప్లకార్డుల ప్రదర్శించటం టీడీపీ శ్రేణులందరినీ విస్మయానికి గురి చేసింది. ‘‘కేంద్ర మంత్రికి రాజీనామా లేఖ డ్రాఫ్ట్‌ చేయాలా...’ అంటూ సైటెర్‌తో ఫ్ల కార్డులు ప్రదర్శించటం బీజేపీ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement