కృష్ణానదిలో దూకి యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో దూకి యువకుడు ఆత్మహత్య

Jul 28 2026 2:00 AM | Updated on Jul 28 2026 2:00 AM

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యనమలకుదురుకు చెందిన కోనేరు నాగార్జున (35) కొద్ది రోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చాడు. అనంతరం ప్రకాశం బ్యారేజీకి చేరుకుని కృష్ణానదిలోకి దూకాడు. బ్యారేజీపై స్థానికులిచ్చిన సమాచారంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కృష్ణానదిలోకి వెళ్లి నాగార్జునను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతునికి వివాహం కాలేదని తెలిసింది. విషయం తెలుసుకున్న సీఐ గుణరాము అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement