కూటమి నేతలకు తీరని మట్టి దాహం | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతలకు తీరని మట్టి దాహం

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

రిమ్మనపూడి(పామర్రు): కూటమి నేతల మట్టి దాహానికి అంతులేకుండా పోతోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌ నిప్పులు చెరిగారు. రిమ్మనపూడిలో జువ్వనపూడి రాజేంద్ర ప్రసాద్‌ కుమారుడు శివ పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం గ్రామానికి వెళ్లారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం అక్కడి ప్రజలు అనిల్‌కు గ్రామంలోని చెరువులో జరిగిన మట్టి మాఫియాపై వివరించగా వెంటనే నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ పమిడిముక్కల మండలం తాడంకిలో చెరువును అడ్డగోలుగా తవ్విన నేతలు పామర్రు మండలంలోని రిమ్మనపూడి గ్రామంలో అంతకంటే ఎక్కువ స్థాయిలో మట్టి అమ్మకాలు జరిపారని విమర్శించారు.

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

ఒక పద్ధతి ప్రకారం తోలకాలు చేయాలని కలెక్టర్‌ స్వయంగా తెలిపినా స్థానిక ఎమ్మెల్యే కుమార్‌ రాజా అనుచరుడు మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ చెరువు నుంచి సుమారు 17వేలకు పైగా ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా అమ్మి కూటమి నేతలు సుమారు రూ.3 కోట్ల వరకు వారి ఖాతాలో వేసుకున్నారని తెలిపారు. ఇప్పటికై నా అక్రమ మట్టి మాఫియాను నిలువరించకపోతే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ ఆరేపల్లి శ్రీనివాసరావు, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి పెయ్యల రాజు తదితరులు పాల్గొన్నారు.

కై లే అనిల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement