5న రూట్స్‌ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

5న రూట్స్‌ అవార్డులు

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

5న రూట్స్‌ అవార్డులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): జాతీయ డాక్టర్స్‌ డే సందర్భంగా ప్రతి ఏటా అందించే రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ 13వ వార్షిక అవార్డులను జూలై 5వ తేదీన అందజేయనున్నట్లు ఎంపిక కమిటీ చైర్మన్‌, ఎస్‌ఎల్‌వీ బిల్డర్స్‌ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారానికి జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఘట్టమనేని లక్ష్మీప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. రూట్స్‌ అవార్డులకు సీనియర్‌ ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ పీఎస్‌ఎన్‌మూర్తి, మధుమేహ నిపుణులు డాక్టర్‌ కొండా వేణుగోపాలరెడ్డి, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ కోడే ప్రభాదేవి, సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ కేశవరావు బాబు, బేరియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ గాజుల రమేష్‌, జిరియాట్రిక్‌ కేర్‌ నిపుణులు డాక్టర్‌ అక్కినేని మణి, యువ వైద్యుల విభాగంలో గుంటూరుకు చెందిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ పొట్ల శివయ్య, పల్మోనాలజిస్ట్‌ డాక్టర్‌ కంచర్ల అనీల్‌లను అవార్డులు అందజేస్తామన్నారు. అదే విధంగా ఆయుర్వేదిక్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ కొండా వెంకటేశ్వర్లు, ఉత్తమ సేవా విభాగంలో తేజలాల్‌ సోలాంకిని ఎంపిక చేశామని చెప్పారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పీవీఎస్‌ భాస్కర్‌, సంజయ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement