వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చాం. ఎక్కడా అవకతవకలు జరగలేదు. పూర్తి పారదర్శకంగా జరిగాయి. ఈ ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. అన్యాయం జరిగిన అభ్యర్థులు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి అన్న నమ్మకం మీకుంటే వాస్తవాలు బయటపెట్టాలి.
– మొండితోక జగన్‌మోహన్‌రావు,
మాజీ ఎమ్మెల్యే


