అర్జీ పునరావృతమైతే అధికారులదే బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అర్జీ పునరావృతమైతే అధికారులదే బాధ్యత

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

అర్జీ పునరావృతమైతే అధికారులదే బాధ్యత

జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ ప్రజల నుంచి 167 అర్జీలు స్వీకరణ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సమగ్ర సమాచారంతో, అర్జీదారుడి సంతృప్తే లక్ష్యంగా స్పష్టతతో పరిష్కారం చూపాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ నందు పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్ర సమాచారంతో నిర్దేశించిన గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిబంధనలను పాటిస్తూ అర్జీదారుడు సంతృప్తే లక్ష్యంగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పునరావృతమయ్యే అర్జీలకు సంబంధిత జిల్లా స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు లోపు అర్జీలను పరిష్కరించాల్సిందేనని, పరిష్కారం సంబంధిత అధికారులు పరిధిలో ఉండి కూడా పెండింగ్‌ ఉంటే చర్యలు తప్పవన్నారు.

అర్జీల వివరాలు ఇవి..

పీజీఆర్‌ఎస్‌ ద్వారా మొత్తం 167 అర్జీలు అందాయని కలెక్టర్‌ తెలిపారు. వీటిలో ఎంఏ యూడీ–36, రెవెన్యూ– 22, పంచాయతీరాజ్‌– 21, పోలీస్‌–16, ఏపీఎస్‌డబ్ల్యూఐఆర్‌ఈఎస్‌ –7, హెల్త్‌ –7, పౌర సరఫరాలు–6, ఇరిగేషన్‌ –6, విద్య –5, డీఆర్‌డీఏ –4, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ –3, హౌసింగ్‌–3, ఆర్‌డబ్ల్యూఎస్‌ –3, ఏపీఎస్‌ ఆర్టీసీ–3 డ్వామా–2, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ –2, ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌–2, మహిళా, శిశు సంక్షేమం–2, పశుసంవర్ధక శాఖ –2, సోషల్‌ వెల్ఫేర్‌–2, ఏపీసీపీడీసీఎల్‌ –2, క్రీడలు, ఆర్‌ అండ్‌బీ, ఉద్యానవనం, బ్యాంకు సంబంధిత, విభిన్న ప్రతిభావంతులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, సహకార సంఘాలు, ఎండో మెంట్స్‌, ఎకై ్సజ్‌, కార్మిక శాకలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ వచ్చిందని కలెక్టర్‌ తెలిపారు.

కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహ, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ప్రత్యేక అధికారి జి.జ్యోతి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement