మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసింది. ఎన్నికల సమయంలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసింది. మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మార్చింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీలో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రజలకు, నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలి. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– దేవినేని అవినాష్,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు


