కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిగా జ్యోతిరమణి | - | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిగా జ్యోతిరమణి

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిగా జ్యోతిరమణి

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిగా కె. జ్యోతిరమణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేసిన ఎన్‌. పద్మావతి శనివారం పదవీవిరమణ చేశారు. ఈ స్థానంలో కృష్ణాజిల్లా వనరుల కేంద్రం డెప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై మార్క్‌ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఇటీవల బదిలీ అయిన రమణిను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం కలెక్టర్‌ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement