రైల్వే ఉద్యోగుల కనీస వేతనం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగుల కనీస వేతనం పెంచాలి

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

రైల్వే ఉద్యోగుల కనీస వేతనం పెంచాలి

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): రైల్వే అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన ఉద్యోగులకు కనీస వేతనం రూ.69వేలుగా ఉండాలని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమెన్‌ (ఎన్‌ఎఫ్‌ఐఆర్‌) జాతీయ అధ్యక్షుడు మర్రి రాఘవయ్య డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మే 19న హైదరాబాద్‌కు వచ్చిన వేతన సంఘ ప్రతినిధులకు రైల్వే ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ఎంప్లాయీస్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో నూతన పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేయాలని, ఫిట్‌మెంట్‌ 3.83 శాతంగా ఉండాలని, కనీస వేతనం రూ.69వేలుగా నిర్ణయించాలని, అదే విధంగా ఇంటి అద్దె అలవెన్సులు మార్చాలని, ఇంక్రి మెంట్‌ పెంపు ఐదు శాతం ఉండాలని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న రైల్వే ఉద్యోగులు, కార్మికులకు ప్రత్యేక అలవెన్సులు అందజేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement