వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం నిర్వహించిన కీ బోర్డు సంగీత వాయిద్య బృందంలో విజయవాడకు చెందిన చిన్నారికి స్థానం లభించింది.
నగరంలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న మైఖల్ డేవిడ్ మందా ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జోరాస్ట్రియన్ క్లబ్‌లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో కీబోర్డ్ సంగీత వాయిద్య పోటీల్లో పాల్గొన్నాడు. 22 దేశాల నుంచి సుమారు 2000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు హాజరై ఏకంగా గంట సమయం వరకు ఆగకుండా ప్రదర్శన చేశారు. 777 మంది ఎంపిక కాగా ఈ ప్రదర్శనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం లభించింది. ఈ సందర్భంగా హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అధినేత అగస్టిన్ దండింగి చేతుల సర్టిఫికెట్ ప్రదానోత్సం ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లో జరిగింది. మైఖల్ డేవిడ్ మందా సర్టిఫికెట్‌ను అందుకున్నారు.


