డాక్టర్‌ సుహాసిని సేవలు స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ సుహాసిని సేవలు స్ఫూర్తిదాయకం

May 31 2026 1:42 AM | Updated on May 31 2026 1:42 AM

డాక్టర్‌ సుహాసిని సేవలు స్ఫూర్తిదాయకం సాగరతీరం అల్లకల్లోలం

ఉద్యోగ విరమణ సభలో పలువురు వక్తలు

లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ మాచర్ల సుహాసిని అందించిన సేవలు యువ వైద్యులకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఉమ్మడి కృష్ణాజిల్లా డీఎంహెచ్‌ఓగా 18 నెలల పాటు పనిచేసిన ఆమె, ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటైన నాటి నుంచి నాలుగేళ్ల రెండు నెలల పాటు సమర్థంగా సేవలు అందించారని పలువురు ప్రశంసించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుహాసిని ఉద్యోగవిరమణ సభ శనివారం గవర్నర్‌పేటలోని ఐవీ ప్యాలెస్‌లో జరిగింది. సభలో జేసీ ఇలక్కియతో పాటు, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ కె.పద్మావతి, గుంటూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విజయలక్ష్మి, జాయింట్‌ డైరెక్టర్‌ గణపతిరావు, స్టేట్‌ ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దేవితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుహాసిని సుదీర్ఘకాలం పాటు ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలో అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఇందుమతిదేవి, డీఐఓ డాక్టర్‌ శరత్‌బాబు, ఎన్‌హెచ్‌ఓ డీపీఎంఓ డాక్టర్‌ నవీన్‌, ఆర్‌బీఎస్‌కే అధికారి డాక్టర్‌ మాధవీనాయుడు, స్టాటికల్‌ ఆఫీసర్‌ లక్ష్మోజీ, జిల్లాలోని వైద్యాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

కోడూరు: హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ మార్పులతో రెండు రోజుల నుంచి అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. శనివారం మరింత అధికమైంది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. తీరంలోని ఇసుకతిన్నెలు సైతం భారీగా కోతకు గురయ్యాయి. పౌర్ణమి ఘడియలు కావడంతో సముద్రుడి హోరుతో తీరప్రాంతం ప్రతిధ్వనిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో అటవీ అధికారులు ముందు జాగ్రత్తగా తీరం గేట్లను మూసివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement