రారు.. రానని అనరు! | - | Sakshi
Sakshi News home page

రారు.. రానని అనరు!

May 29 2026 8:22 AM | Updated on May 29 2026 8:22 AM

రారు.. రానని అనరు!

త్యాగ నిరతి..

వరుస ఘటనలు..

ఉద్యోగం ఒక చోట.. జీతం మరో చోట..

బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ముస్లింలు ప్రత్యేక నమాజ్‌లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులతో పాటు, ఖాళీ ప్రాంగణాల్లో సామూహిక ఈద్‌ నమాజ్‌ నిర్వహించారు. త్యాగం, విధేయత, దాతృత్వం, సోదరభావం వంటి గొప్ప సందేశాలను ఈ పర్వదినం ప్రపంచానికి తెలియజేస్తోందని ముస్లిం పెద్దలు వివరించారు. ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో జరిగిన సామూహిక ఈద్‌ నమాజ్‌లను చిత్రాల్లో చూడొచ్చు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయవాడ

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆలయాల పరిపాలనను ప్రభుత్వం గాలికి వదిలేసిందని సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఆలయాల పరిరక్షణతో పాటుగా నిత్యం జరిగే వైదిక కార్యక్రమాలు, భక్తులకు కల్పించాల్సిన వసతులు.. ఇలా ఆయా దేవుని సన్నిధిని పర్యవేక్షించాల్సిన దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు వాటిని పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, వాటి ఆధ్వర్యంలో ఉన్న ఆస్తులను అధికార పార్టీ నేతలకు అందించే కార్యక్రమంలో మాత్రం బిజీగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అందులో భాగంగానే అధికారులు తమకిష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.

వారంలో ఒక్కరోజూ రారు..

ఉమ్మడి జిల్లాలో చాలా మంది కార్యనిర్వహణాధికారులకు ఒకటి, రెండు లేదా ఇంకా ఎక్కువ ఆలయాల బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. వారివారి లాబీయింగ్‌తో పాటుగా రాష్ట్ర స్థాయి అధికారుల సహాయ సహకారాలతో వీలైనన్ని ఎక్కువ ఆలయాల బాధ్యతలు చూస్తుంటారు. అయితే వారంలో ఒక రోజైనా ఆయా ఆలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. కనీసం ముఖ్యమైన రోజుల్లోనైనా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆయా ఆలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ నెల మొత్తం మీద మూడు నాలుగు రోజులు కూడా ఆయా ఆలయాలకు వెళ్లని అధికారులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా విజయవాడలో ఒక్క ఆలయంలో విధులు నిర్వహిస్తున్నా, నాలుగైదు రోజులకు ఒకసారి కూడా అక్కడ కనిపించని వారు చాలా మంది ఉన్నారని పలువురిపై ఆరోపణలు ఉన్నాయి.

వారికే కీలక బాధ్యతలు..

ఆరోపణలు ఉన్న వారికి ఏసీ కార్యాలయంలో బాధ్యతలు సహాయ కమిషనర్‌ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై ఇతర ఆలయాలు సత్రాల నుంచి వచ్చిన అధికారులపై పలు ఆరోపణలు ఉన్నట్లు ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించిన దస్త్రాలు మాయం చేసిన వారు, భూముల విక్రయించటం, హుండీ చోరీ తదితర ఆరోపణలు ఉన్న వ్యక్తులు సహాయ కమిషనర్‌ కార్యాలయంలో ఎలా విధులు నిర్వర్తిస్తారని దేవదాయ శాఖ ఉద్యోగులు సైతం ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల ఆస్తులకు సంబంధించి అధికార పార్టీ నేతలకు సహాయ మందించే లక్ష్యంతో కొంతమంది పని చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

దేవదాయ శాఖకు చెందిన వివిధ స్థాయిల్లోని అధికారుల తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం భూముల వ్యవహారంతో పాటుగా గుడివాడలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం స్వామి వారి కిరీటం అంశంపై అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పైకి కనిపించే అంశాలు కొన్ని మాత్రమే అని ముడుపులతో చాలా విషయాలు బయటకు రాకుండా అధికారులు తొక్కిపెడుతున్నారని ఉద్యోగులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం విధానాల ఫలితంగానే దేవదాయ శాఖ అధికారులు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న పలు ఆలయాలకు సంబంధించి పని చేస్తున్న అధికారులు ఒక చోట జీతం తీసుకుంటూ మరో చోట పని చేయటంపై భక్తులు మండి పడుతున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా ఆ శాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయంలో లక్ష్మీనారాయణశెట్టి సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. జిల్లాలోని వేలాది ఆలయాల పర్యవేక్షణకు సంబంధించిన విధులను నిర్వర్తించాల్సిన ఆయన.. పెద్ద అవుటుపల్లి గ్రూప్‌ టెంపుల్స్‌కు కార్యనిర్వహణాధికారిగా సైతం వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సత్యనారాయణపురం శివాలయంలో బి. గంగాధర్‌ గ్రేడ్‌–2 కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్నారు. ఆయనే జిల్లా సహాయ కమిషనర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా డెప్యూటేషన్‌పై పని చేస్తున్నారు.

జి.కొండూరు గ్రూప్‌ టెంపుల్స్‌కు గ్రేడ్‌–2 కార్యనిర్వహణాధికారిగా కె. నాగరాజు కొనసాగుతున్నారు. నాగరాజు ఆ బాధ్యతలతో పాటుగా సహాయ కమిషనర్‌ కార్యాలయంలోనూ డెప్యూటేషన్‌పై పని చేస్తున్నారు.

పాతబస్తీలోని చల్లంరాజు వారి సత్రం కార్యనిర్వహణాధికారిగా సుబ్బారెడ్డి పని చేస్తున్నారు. ఆయన సైతం సహాయ కమిషనర్‌ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదే రీతిలో చాలా మంది తమతమ ఆలయాలు, సత్రాల నిర్వహణను వదిలేసి సహాయ కమిషనర్‌ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై పని చేయటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

వారంలో ఒక్కరోజూ

ఆలయాలకు రాని వైనం

గాడి తప్పుతోన్న పాలన

ఇటీవల పలు ఆలయాల్లో ఘటనలతో ఇబ్బందికర పరిస్థితులు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

Advertisement
 
Advertisement
Advertisement