కుట్రలను తిప్పి కొట్టండి | - | Sakshi
Sakshi News home page

కుట్రలను తిప్పి కొట్టండి

May 29 2026 8:22 AM | Updated on May 29 2026 8:22 AM

జాబితాలను సరిచూడండి..

జాబితాలను సరిచూడండి..

వైఎస్సార్‌ సీపీ బీఎల్‌ఏలతో

మాజీ మంత్రి పేర్ని నాని

పామర్రులో ఎస్‌ఐఆర్‌,

జాబితా మ్యాపింగ్‌పై అవగాహన

పామర్రు: వైఎస్సార్‌ సీపీకి చెందిన ప్రతి బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌(బీఎల్‌ఏ) తన పరిధిలో ఉన్న బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌(బీఎల్‌వో)ల నుంచి మ్యాపింగ్‌ కాని లిస్టులను తీసుకుని, ఈనెల 30 తేదీ నాటికి వాటిని మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. స్థానిక ఆరేపల్లి కల్యాణ మండపంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(ఎస్‌ఐఆర్‌)పై బీఎల్‌ఏలకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ ఇంతకు ముందే టీడీపీ నేతలు తమ వారికి మ్యాపింగ్‌ చేశారని, మిగిలిన 35శాతం మాత్రమే బీఎల్‌వోల వద్ద మ్యాపింగ్‌ కాకుండా లిస్టులో ఉందని అన్నారు. ఈ లిస్టులను ప్రతి బీఎల్‌ఏలు తీసుకుని దానిలో ఉన్న పార్టీ సభ్యులతో పాటు పార్టీ సానుభూతిపరుల పేర్లను కూడా తీసుకుని వాటికి కూడా మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇది చాలా కీలకమన్నారు. పామర్రులోని 243 బూత్‌లలోని బీఎల్‌ఏలకు వారికి సంబంధించిన బీఎల్‌వోల ఫోన్‌ నంబర్లు, పేరులను మీకు అందజేస్తామని చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఇప్పుడు హైబ్రీడ్‌ మీటింగ్‌లను ఏర్పాటు చేసి, రెండు రోజుల పాటు ‘జయము జయము లోకేష్‌’ అంటూ భజన చేస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప.. రాష్ట్ర అభివృద్ధి గురించి కాని రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క మాట మాట్లాడిన పరిస్థితి లేదని విమర్శించారు.

● రాష్ట్ర పోలింగ్‌ బూత్‌ వింగ్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను డిజిటల్‌ స్క్రీన్‌పై వివరించామని తెలిపారు. గతంలో 2002లో స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ సర్వే నిర్వహించారని, ప్రస్తుతం 2025డేటా ఆధారంగా ఈ సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నారని, బీఎల్‌ఏలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలన్నారు.

● ఎస్‌ఐఆర్‌ జోన్‌ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ ప్రతి బీఎల్‌ఏ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. గ్రామాల్లోని ఓట్ల పోకుండా తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

● పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నియోజకవర్గంలో ఏవిధమైన అభివృద్ధి చేయకుండా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సైకిల్‌పై తిరుగు తూ తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారన్నారు.

పామర్రు నియోజకవర్గ పరిశీలకుడు వేములకొండ తిరుపతిరావు, పామర్రు ఎంపీపీ దాసరి అశోక్‌ కుమార్‌, జెడ్పీటీసీ జొన్నల రామ్మోహన్‌రావు, నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వరరావు, యలమంచిలి గణేష్‌బాబు, రాజులపాటి రాఘవరావు, కళ్లం వెంకటేశ్వరరెడ్డి, గోగం సురేష్‌, బూత్‌ వింగ్‌ అధ్యక్షుడు సమ్మెట ఆంజనేయులు, వైస్‌ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, కొడమంచిలి మహేష్‌, పామర్రు పట్టణ అధ్యక్షుడు నందిపాటి సురేష్‌రెడ్డి, ట్రేడ్‌ యూని యన్‌ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, బీసీ సెల్‌ అధ్యక్షుడు ఆళ్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement