ఎ.కొండూరు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురంలో గురువారం ఉదయం చోటు చేసు కుంది. సేకరించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం పెనుబల్లి మండలం సూరయ్యబంజర గ్రామానికి చెందిన మాలావతు నాగు (26)కు భార్య, కుమారుడు ఉన్నారు. నాగు గురువారం రేపూడి గ్రామం నుంచి బయలుదేరి సూరయ్య బంజరు వెళ్తున్న క్రమంలో మణుగూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారు బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో నాగు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


