మహానాడుకు రండి.. చీరలు అందుకోండి | - | Sakshi
Sakshi News home page

మహానాడుకు రండి.. చీరలు అందుకోండి

May 29 2026 8:22 AM | Updated on May 29 2026 8:22 AM

మహానాడుకు రండి.. చీరలు అందుకోండి విద్యుదాఘాతంతో ఒకరు మృతి

టీడీపీ నేతల వ్యూహం

భవానీపురం(వియవాడపశ్చిమ): మాయ మాటలు, తాయిలాల పంపిణీతో ప్రజలను ఆకట్టుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు టీడీపీ నేతలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ మీటింగ్‌లకు జనాల్ని ఎలా రప్పించుకునేందుకు సకల విద్యలు ప్రయోగిస్తున్నారు. ఇదే ఆనవాయితీ గురువారం మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామ పార్టీ నాయకులు కూడా కొనసాగించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని రెండు రోజులపాటు గొల్లపూడిలోని పద్మావతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఆ మీటింగుకు జనాలను రప్పించేందుకు స్థానిక నేతలు మీటింగ్‌కు హాజరయ్యే వారికి రూ.300, బిర్యానీ, మహిళలకు చీరల పంపిణీ ఉంటుందని ప్రచారం చేసి రప్పించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో కురిసిన గాలివానకు విద్యుత్‌ షాక్‌కు గురై ఒకరు మృతి చెందారు. నగరానికి చెందిన వ్యక్తి ఇందిరాగాంధీ స్టేడియం పక్క రోడ్డులోని ఫుడ్‌ కోర్ట్‌ ఫుడ్‌ కోర్టుకు వచ్చాడు. ఆకస్మికంగా గాలివాన రావడంతో విద్యుత్‌ తీగలు తెగిపడి తగలడంతో షాక్‌ కు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన వ్యాపారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలియ రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement