దేదీప్యమానంగా డోకిపర్రు గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థాన వార్షికోత్సవాలు బుధవారం దేదీప్యమానంగా నిర్వహించారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేతలు, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో బుధవారం విష్వక్సేనారాధన, పుణ్యాహం, యజమాన సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, నవకలశ పూజ, అష్టోత్తర శత కలశ పూజ, విశేష మహాశాంతి హోమం, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ధృవ మూర్తికి విశేష పూజ అష్టోత్తర కలశాభిషేకాల్ని వేద పండితులు వేద మంత్రోచ్ఛరణ నడుమ మంగళ వాయిద్యాలతో నిర్వహించారు. సర్వాలంకార భూషితులైన ఉత్సవమూర్తులకు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు స్వామివార్లకు ప్రత్యేక పూజలను చేశారు. భక్తులు ఈ ఉత్సవాలను తిలకించి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు.
‘అభ’ ఐడీతో అనేక ప్రయోజనాలు గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్టు పెనమలూరు: గంజాయి విక్రయిస్తున్న మహిళ బుధవారం యనమలకుదురులో పట్టుబడింది. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు జన్మభూమి వంతెన వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న స్కూటీపై వెళ్తున్న తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన చదల జ్యోతిని ఆపారు. స్కూటీలో గుర్తించిన 1.95 కేజీల గంజాయిని స్వాధీం చేసుకొని వాహనం సీజ్ చేశారు. ఆమె కొద్దికాలంగా యనమలకుదురులో గది అద్దెకు తీసుకొని ఉంటుంది. ఆమె నర్సీపట్నానికి చెందిన రవి అనే వ్యక్తి నుంచి 6 కేజీల గంజాయి కొని చిన్న పొట్లాలుగా కట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు తెలిసింది. నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
ఘనంగా శ్రీ వేంకటేశ్వరుని
దేవస్థాన వార్షికోత్సవాలు
డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభ) ఐడీని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, దానితో అనేక ప్రయోజనాలు ఉన్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ అభ ఐడీపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలని వైద్య సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. అభ ఐడీతో హెల్త్ రికార్డులు డిజిటల్‌గా భద్రంగా ఉంటాయని, ఒక్కసారి ఐడీ క్రియేట్‌చేసి, మనం ఎప్పుడు టెస్ట్‌లు చేయించుకున్నా, ఆ ఐడీలో రికార్డు అవుతాయన్నారు. గతంలో ఫైల్స్‌ను భద్రపర్చాల్సిన అవసరం ఉండదని ఆమె తెలిపారు. ల్యాబ్ రిపోర్టులు, వైద్యుని ప్రిస్క్రిప్షన్ వంటి ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ గా పొందవచ్చున్నారు. ధ్రువీకరించిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ద్వారా టెలి కన్సల్టేషన్ సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. కాబట్టి 14– అంకెల ప్రత్యేక హెల్త్ ఐడెంటి నెంబర్, అభను పొందండి డిజిటల్ అవ్వండి అనే నినాదంతో అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు.