గుర్తు తెలియని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

May 27 2026 10:20 AM | Updated on May 27 2026 10:20 AM

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

పటమట(విజయవాడతూర్పు): పటమట పీఎస్‌ పరిధిలోని నిర్మల జంక్షన్‌ దగ్గరలో సర్వీస్‌ రోడ్డులోని ఎంపైర్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌ కింద సుమారు 50 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పటమట సీఐ పవన్‌ కిషోర్‌ తెలిపారు. మంగళవారం ఉదయం స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పటమట పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. మృతుని శరీరంపై షర్టు లేకుండా బ్లూ కలర్‌ జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడని, అతని పేరు వివరాలు తెలియ రాలేదని, వివరాలు తెలిసినవారు పటమట పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement